ADMISSIONS INTO SV TRADITIONAL SCULPTURE AND ARCHITECTURE COLLEGE _ ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Tirupati, 01 May 2024: Eligible students are invited to apply for admission in Diploma and Certificate Courses in Traditional Kalamkari Art for the academic year 2024-25 in Sri Venkateswara Traditional Sculpture and Architecture College under the auspices of TTD.
Applications can be received in the college till June 17 starting from May 1. Completed applications should be submitted to the college by the evening of June.
Students who want to join a 4 years Diploma, 2 years certificate course can contact www.tirumala.org website or college office on 0877-2264637, 9866997290 during office hours on working days for course eligibility and other details.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, 2024 మే 01: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరడమైనది. కళాశాలలో జూన్ 17వ తేదీ వరకు దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 17వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.
4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేర దలచిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637, 9866997290 నంబరులో గానీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.