SPECIAL FESTIVITIES AT SRI GT IN APRIL _ ఏప్రిల్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, March 29, 2024:  TTD is organising special festivals at Sri Govindarajaswami temple in the month of April 2024.

The following are details:

  • April 5,19,26,all Friday evening procession of Sri Andala Ammavaru on Mada streets.
  • April4: Koil Alwar Thirumanjanam 

• April 12: Evening Procession of Sri Parthasarathi with consorts Rukmini and Sathyabama on Mada streets on Rohini Nakshatram.

• April 17: Evening procession of Sri Pattabhirama swam with Sita Lakshmana and Anjaneya on Mada streets on the occasion of Sri Ramanavami festival.

• April 20 to 22  Evening procession of Sri Govindarajaswami with consorts Sridevi and Sri Bhudevi on the occasion of Buggotsavam fete.

  • April 21: Sri Govindarajaswami with consorts evening procession on the occasion of Uttara Nakshatram.
  • April 23: Panakalva utsavam of Sri Govindarajaswami 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్‌లో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 ఏప్రిల్ 29: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– ఏప్రిల్ 5, 19, 26వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

– ఏప్రిల్ 4న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

– ఏప్రిల్ 4వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భక్తులను అనుగ్రహిస్తారు.

– ఏప్రిల్ 9న ఆల‌యంలో ఉగాది ఆస్థానం

– ఏప్రిల్ 12న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

– ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామివారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.

– ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వ‌ర‌కు ప్రతి రోజు సాయంత్రం బుగ్గోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

– ఏప్రిల్ 21న‌ ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్వ‌నం ఇవ్వ‌నున్నారు.

ఏప్రిల్ 23న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.