ఏప్రిల్‌ 10 నుండి చెన్నైలో శ్రీనివాస కల్యాణాలు

ఏప్రిల్‌ 10 నుండి చెన్నైలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, ఏప్రిల్‌ 02, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుమూలలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 10 నుండి 14వ తేదీ వరకు చెన్నై మహానగరంలో నాలుగు చోట్ల శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

ఏప్రిల్‌ 10వ తేదీన చెన్నై నగరంలోని తాంబరంలో గల శ్రీ కంచి మహాస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. అదేవిధంగా రాధేకృష్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న చెన్నై, అగరమేల్‌లోని వివేకానంద పాఠశాలలో, ఏప్రిల్‌ 13న అంబత్తూరులో, ఏప్రిల్‌ 14న పెరంబూర్‌లో స్వామివారి కల్యాణాలను వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణ ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.