E AUCTION OF VASTRAMS _ ఏప్రిల్ 10 నుండి 15వ తేదీ వరకు వస్త్రాల ఈ – వేలం
TIRUPATI, 26 MARCH 2023: The e-Auction of vastrams and clothes donated by devotees to TTD local temples will be carried out on April 10 to 15.
The vastrams and clothes includes silks, polyester, art silk, nylon, nylex, turkey towel, shawls etc.
For more details contact 08772264429 during office hours on working days.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 10 నుండి 15వ తేదీ వరకు వస్త్రాల ఈ – వేలం
తిరుపతి, 26మార్చి 2023: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుండి 15వ తేదీ వరకు ఈ – వేలం ( ఆన్ లైన్ లో) వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 297 లాట్లు ఉన్నాయి.
ఇందులో ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ /నైలాన్ /నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు,
హుండీ గల్లేబులు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయి.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.