SRI RAMA NAVAMI FETE AT SRI KRT ON APRIL 17-19 _ ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీ రామనవమి ఉత్సవాలు
Tirupati 30, March 2024: TTD is organising the annual Sri Rama Navami festival from April 17-19 at the Sri Kodandarama Swamy in a grand manner.
The festivities include Abhisekam to the main deity on the 17th, Snapana Thirumanjanam to Utsava Idols of Sri Rama, Sita Lakshmana, Anjaneya Swamy varu. Grand Sri Rama Navami Asthana and finally Hanumantha Vahana at night on the Mada streets.
SRI SITARAMA KALYANAM ON APRIL 18
SRI RAMA PATTABHISHEKAM ON APRIL 19
The festivities begin with the thirumanjanam of Swamy with thirtham brought in a procession from Narasimha thirtsm and Pattabhisekam, the procession of utsava idols on Bangaru Thiruchi along with Sri Anjaneya Swamy.
On April 20 the khanija theta utsava is held in the Sri Kodandaramaswami temple.
TEPPOTSAVAM FROM APRIL 21-23
The annual Teppotsavam of Sri Kodandaramaswami temple will commence every day at the Sri Ramachandra Pushkarani.
Other festivities include daily Snapana thirumanjanam, five rounds of float on the first day, seven rounds on the second day and nine rounds on the final day.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీ కోదండరామాలయంలో శ్రీ రామనవమి ఉత్సవాలు
తిరుపతి, 2024 మార్చి 30: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.
ఏప్రిల్ 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.
ఏప్రిల్ 18న శ్రీ సీతారాముల కల్యాణం :
ఏప్రిల్ 18న తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఏప్రిల్ 19న శ్రీరామ పట్టాభిషేకం :
ఏప్రిల్ 19న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 20వ తేదీన ఖనిజ తోట ఉత్సవం జరుగనుంది.
ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు తెప్పోత్సవాలు :
శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.