ఏప్రిల్‌ 18న శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ మహామంత్రానుష్ఠాన మహాయాగం

ఏప్రిల్‌ 18న శ్రీ కోదండరామాలయంలో శ్రీరామ మహామంత్రానుష్ఠాన మహాయాగం

తిరుపతి, ఏప్రిల్‌ 16, 2013: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 18వ తేదీన శ్రీరామ మహామంత్రానుష్ఠాన మహాయాగం శాస్త్రోక్తంగా జరగనుంది. తితిదే ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు ఆధ్వర్యంలో వంద మందికిపైగా ఋత్వికులు యాగం నిర్వహించనున్నారు. రామతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు, లోకకల్యాణం కోసం, ప్రపంచశాంతి కోసం ఈ మహాయాగం నిర్వహించనున్నట్టు తితిదే ఆగమ పండితులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.