BUGGOTSAVAM FROM 20-22 APRIL _ ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం
Tirupati, 19 April 2024: The annual Buggotsavam at Sri Govindarajaswamy temple in Tirupati will be held grandly from 20th to 22nd April.
In this festival, which will be held for three days, every day at 2 pm, Sri Govindarajaswamy along with Sridevi and Bhudevi are worshipped in the temple.
In the afternoon from 2.30pm to 4.30pm, Snapana Tirumanjanam, Samarpana and Aasthanam will be conducted for the deities of Swami and Ammavarlu.
From 5.30pm to 6pm in the evening, Srivari Unjalaseva will be held with Ubhayanancharis, after which the devotees will be given Darshan.
Asthanam will be held at Sri Mahalakshmi Ammavari Temple from 6 pm to 6.30 pm.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం
తిరుపతి, 2024 ఏప్రిల్ 19: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏప్రిల్ 20 నుండి 22వ తేదీ వరకు బుగ్గోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవంలో ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలయంలోని బుగ్గ వద్దకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని వేంచేపు చేస్తారు. మధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆస్థానం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఉభయనాంచారులతో కలసి శ్రీవారి ఊంజలసేవ, అనంతరం బుగ్గ వద్ద భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.
సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు శ్రీ మహలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఆస్థానం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.