TEPPOTSAVAMS _ ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు శ్రీ కోదండ రాముని తెప్పోత్సవాలు

Tirupati, 19 April 2024: The annual Teppotsavams in Sri Kodanda Ramalayam will commence from April 21 and concludes on April 23.

Every day the float festival of Tirupati Sri Kodana Ramalayam in Sri Ramachandra Pushkarini in the evening with Snapana Tirumanjanam in the morning.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు శ్రీ కోదండ రాముని తెప్పోత్సవాలు

తిరుప‌తి, 2024 ఏప్రిల్ 19: తిరుపతి శ్రీకోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు వైభ‌వంగా జరుగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి .

ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు స్వామివారు తెప్పలపై విహరిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.