ఏప్రిల్‌ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్‌ 4వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం 

ఏప్రిల్‌ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్‌ 4వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం

తిరుమల మార్చి-20, 2009: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్‌ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్‌ 4వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఏప్రిల్‌ 3వ తేదిన శ్రీరంగనాయకుల మండపంలో ఉదయం 10గంటలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 7గంటలకు శ్రీరాములవారు హనుమంత వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. అనంతరం రాత్రి 10 గంటలకు బంగారువాకిలి వద్ద పురాణప్రవచనం నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 4వ తేదిన మధ్యాహ్నం 12గంటలకు శ్రీభాష్యకార్ల సన్నిధి ముఖమండపం వద్ద ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వసంతోత్సవం రద్దు చేశారు. రాత్రి 9 గంటలకు బంగారు వాకిలివద్ద పురాణప్రవచనం జరుగుతుంది. ఇదే రోజున సాయంత్రం 5.30 గంటలకు శ్రీరాములవారికి సహస్రదీపాలంకారసేవ నిర్వహిస్తారు.

శ్రీరామనవమి, శ్రీరామపట్టాభిషేకం ఉత్సవాల సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.