ఏప్రిల్‌ 4న తితిదే ఆధీనంలోని నివాసగృహం బహిరంగ వేలం

ఏప్రిల్‌ 4న తితిదే ఆధీనంలోని నివాసగృహం బహిరంగ వేలం

తిరుపతి, మార్చి 18, 2013: తిరుపతి నగరంలోని శ్రీకృష్ణదేవరాయనగర్‌లో తితిదే ఆధీనంలో ఉన్న నివాసగృహాన్ని ఏప్రిల్‌ 4వ తేదీన తితిదే బహిరంగ వేలం వేయనుంది. ఈ నివాసగృహం విలువను రూ.45 లక్షలుగా తితిదే నిర్ణయించింది. తితిదే పరిపాలనా భవనం ఆవరణలో మధ్యాహ్నం 3.00 గంటలకు వేలం జరుగనుంది. ఆసక్తి గలవారు రూ.4,50,000/-లను ”కార్యనిర్వహణాధికారి, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి” పేరున డిడి తీసి వేలంలో పాల్గొనవచ్చు. ఇతర వివరాలకు 0877-2264220, 0877-2264203 నంబర్లలో సంప్రదించవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.