ANNAMAYYA VARDHANTI UTSAVAS FROM APRIL 4-8 _ ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి ఉత్సవాలు

Tirupati,28 March 2024: TTD is grandly organising the 521st Vardhanti of Sri Tallapaka Annamacharya from April4-8 at Dhyan mandir and the 108 feet Annamaiah statue at Tallapaka in Kadapa district Narayanagiri gardens in Tirumala and Annamacharya Kala Mandir at Tirupati.

The festivities will begin at Padala Mandapam in Alipiri, Tirupati at 6.00 am on April 4 and a vibrating  Saptagiri sankeertan Gosti Ganam at Narayanagiri Gardens on the same day evening.

For four days from  April 5-8 TTD will conduct religious and Bhakti sangeet programs at Annamacharya Kala Mandir at Tirupati.  Elides at Dhyan mandir and 108 feet  Annamacharya statue at Tallapaka.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి ఉత్సవాలు

తిరుపతి, 2024 మార్చి 28: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 521వ వ‌ర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుండి 8వ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహించనున్నారు.

ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది. ఏప్రిల్ 5న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో స‌ప్త‌గిరి సంకీర్త‌నా గోష్ఠిగానం నిర్వహిస్తారు.

ఏప్రిల్ 5 నుంచి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.