521st ANNAMAYYA VARDHANTI IN TIRUMALA ON APRIL 5 _ ఏప్రిల్ 5న తిరుమలలో 521వ అన్నమయ్య వర్థంతి
Tirumala, March 17, 2024: TTD is grandly organising the 521st death anniversary of the father of prose poetry Sri Tallapaka Annamacharya on April 5 in Tirumala.
On this occasion, Sri Malayappaswamy along with Sridevi and Bhudevi arrive at Narayangiri Gardens to witness the Saptagiri Sankeertana Gosti Ganjam performed by artists of the Annamacharya project.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
ఏప్రిల్ 5న తిరుమలలో 521వ అన్నమయ్య వర్థంతి
తిరుమల, 2024 మార్చి 17: పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 521వ వర్థంతి కార్యక్రమం ఏప్రిల్ 5న తిరుమలలో టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 5.30 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కూడి ఆలయానికి వేంచేపు చేస్తారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.