ఏప్రిల్‌ 6న తెనాలి, 7న విజయవాడలో శ్రీనివాస కల్యాణాలు

ఏప్రిల్‌ 6న తెనాలి, 7న విజయవాడలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, మార్చి 27, 2013: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో, ఏప్రిల్‌ 7వ తేదీన విజయవాడ నగరంలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు.

తెనాలి పట్టణంలో శాసనసభ స్పీకరు శ్రీ నాదెండ్ల మనోహర్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6న సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది. అదేవిధంగా విజయవాడ నగరంలో తేజశ్విని క్రియేషన్స్‌, శ్రీ హెచ్‌.ఎస్‌.ఆర్‌.మూర్తి ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 7న ఉదయం 10.30 గంటలకు శ్రీవారి కల్యాణం కనులవిందుగా జరుగనుంది. శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్‌ కె.రామకృష్ణ ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.