ఏప్రిల్‌ 6న మెట్లోత్సవం 

ఏప్రిల్‌ 6న మెట్లోత్సవం

తిరుపతి, ఏప్రిల్‌ 02, 2013: పదకవితా పితామహునిగా వినుతికెక్కిన శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 510వ వర్ధంతి ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్‌ 6వ తేదీన తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా మెట్లోత్సవం జరుగనుంది. ఉదయం 7.00 గంటలకు మెట్లపూజ నిర్వహించనున్నారు. అనంతరం సుమారు రెండు వేల మంది భక్తులు భజనలు, కోలాటాలతో అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తూ తిరుమలకు పాదయాత్రగా వెళ్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.