ఏఫ్రిల్‌ 17 నుండి 28 వరకు తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ గోవిందకల్యాణాలు

ఏఫ్రిల్‌ 17 నుండి 28 వరకు తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ గోవిందకల్యాణాలు

తిరుపతి, ఏప్రిల్‌ -16, 2011 : తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏఫ్రిల్‌ 17 నుండి 28 వరకు తూర్పు గోదావరి జిల్లాలో శ్రీ గోవిందకల్యాణాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో 17వ తేదిన రాయపల్లి గ్రామము అడ్డతీగల మండలంలోను, 19వ తేదిన పెద్దగెద్దాడ గ్రామము రంపచోడవరం మండలంలోను, 21వ తేదిన జెడ్డంగి గ్రామము రాజఒమ్మంగి మండలంలోను, 24వ తేదిన గోకవరంమండలం హెడ్‌క్వార్ట్టర్స్‌, 28వ తేదిన కవిటి దిబ్బల గ్రామము వై. రామవరం మండలములోను నిర్వహిస్తారు.

అదేవిధంగా ఏఫ్రిల్‌ 30న అర్ధమూరు గ్రామము మండపేట మండలంలోను, మే 1వ తేదిన పిఠాపురం హెడ్‌క్వార్టర్స్‌, 3వ తేదిన ఆన్నవరం హెడ్‌క్వార్టర్స్‌, 5వ తేదిన పెద్దాపురం హెడ్‌ క్వార్టర్స్‌ లలో నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.