MUSICAL BONANZA IN KAPILATIRTHAM _ కపిలతీర్థంలో ఆకట్టుకున్న గాత్ర సంగీతం

Tirupati, 04 March 2024: The music and dance programs organized by Sri Venkateswara College of Music and Dance  and Sri Venkateswara Nadaswara and Dolu School on the third day of the ongoing annual Brahmotsavam of Sri Kapileswara Swami were impressive on Sunday night.

As a part of this, on the stage set up in the temple premises, the teachers of the vocal department of the college Smt. B. Chinnamadevi’s student group sang many Sankeertans.  In this, the program Namo Bhutanatham …, Chandrasekhara etc.were presented.

Later, Dr. Purna Vaidyanathan, faculty member of the college’s violin department presented Ananda Nitala Prakasam…., Parvati Pathim…., Sabhapathikide…. etc. entertained the audience.

In this program the principal of the college Dr.  Uma Muddubala and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

కపిలతీర్థంలో ఆకట్టుకున్న గాత్ర సంగీతం

తిరుప‌తి, 2024, మార్చి 03: శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల గాత్ర విభాగం అధ్యాపకులు శ్రీమతి బి.చిన్నమదేవి శిష్య బృందం పలు సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో పాహిమాం శ్రీ …, నమో భూతనాథం …, చంద్రశేఖర …, వరలీల గాన లోల… తదితర కీర్తనలతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి వయోలిన్ పై శ్రీ సంకీర్త్ కుమార్, కీబోర్డ్ పై శ్రీ భరద్వాజ, మృదంగం పై పూర్వ ప్రిన్సిపాల్ శ్రీ యం.సుధాకర్, తబలాపై శ్రీ కె.యస్.ఆర్. బుజ్జి సహకారం అందించారు.

అనంతరం కళాశాల వయోలిన్ విభాగం అధ్యాపకులు డాక్టర్ పూర్ణ వైద్యనాథన్ గారి బృందం వయోలిన్ వాద్య కార్యక్రమం జరిగింది. శ్రీ నవీన్ కుమార్, శ్రీ యువరాజ్ వయోలిన్ మీద, డోలు మీద శ్రీ చంద్రశేఖర్ సహకారం అందించారు. ఆనంద నిటల ప్రకాశం…., పార్వతీ పతిం…., సభాపతికిదే….మొదలైన కీర్తనలతో శ్రోతలను రంజింపజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.