KALPAVRUKSHA VAHANA SEVA AT KARVETINAGARAM BTU _ కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకారంలో వేణుగోపాలుడి దర్శనం

Tirupati,01 June 2024: On day 4 of the ongoing Brahmotsavam on Saturday Sri Venugopal Swamy blessed devotees on Kalpavruksha Vahanam along with Sridevi and Bhudevi in Sri Venkateswara swami alankaram.

Temple AEO Sri Parthasarathi, archakas and devotees were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

కల్పవృక్ష వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకారంలో వేణుగోపాలుడి దర్శనం

తిరుపతి, 2024 జూన్ 01: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజు శనివారం ఉదయం 7.30 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.