SRI RAMA GRANTS BOON ON KALPAVRIKSHA _ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
TIRUPATI, 08 APRIL 2024: The fourth day of ongoing annual brahmotsavams in Sri Kodanda Rama Swamy temple witnessed Sri Rama granting boons to His devotees gliding swiftly on the divine tree carrier-Kalpavriksha Vahanam
Devotees lined up to seek the blessings of Purushottama and offered Harati at every corner of the street wherever the carrier paraded.
Later Snapana Tirumanjanam was rendered to the utsava deities of Sri Rama accompanied by Sita Devi and Lakshmana Swamy.
Both the Tirumala seers, DyEO Smt Nagaratna and others were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
తిరుపతి, 2024 ఏప్రిల్ 08: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు.
ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, కంకణభట్టర్ శ్రీ సీతారామాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.