VARIOUS CEREMONIES AND RITUAL SERVICES FOR DEVOTEES AT KALYANA VEDIKA _ కళ్యాణ వేదిక వద్ద భక్తులకు అందుబాటులో వివిధ పూజా కార్యక్రమాలు

SPECIAL PUJAS ORGANISED UNDER THE AUSPICES OF THE PRIESTS ASSOCIATION

Tirumala, 08 February 2026: At the spacious Kalyana Vedika, which is located in the Papa Vinasanam road in Tirumala, through the Purohita Sangham (Priests’ Association) TTD conducts various traditional rituals and ceremonies required by the devotees, at the prescribed nominal charges.

Important religious ceremonies such as Marriage, Upanayanam, Satyanarayana Vratham, Namakaranam, Annaprasana, Aksharabhyasam, Vahana Puja and other rituals are being performed in accordance with scriptures. 

TTD has made these services available at affordable charges for the convenience of devotees.

The details of the services and fees being offered through the Priests’ Association at Kalyana Vedika are as follows:

•  Marriage – Free of cost

•  Upanayanam – Rs. 300

•  Satyanarayana Vratham – Rs. 300

•  Keshakhandana – Rs. 200

•  Namakaranam – Rs. 200

•  Annaprasana – Rs. 200

•  Aksharabhyasam – Rs. 200

•  Vahana Puja – Rs. 200

•  Ear piercing – Rs. 50

•  Ear piercing (at cottage) – Rs. 100

•  Melam (one set) – Rs. 100

•  Melam (two sets) – Rs. 300

•  Dastra Puja – Rs. 200

•  Other religious ceremonies – Rs. 200

Devotees are requested to utilise these services. For further details, they may contact the Priests’ Association located at Kalyana Vedika in Tirumala.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

కళ్యాణ వేదిక వద్ద భక్తులకు అందుబాటులో వివిధ పూజా కార్యక్రమాలు

పురోహిత సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహణ

తిరుమల, 2026 ఫిబ్రవరి 08: తిరుమలలోని శ్రీవారి కళ్యాణ వేదిక వద్ద ఉన్న పురోహిత సంఘం ఆధ్వర్యంలో భక్తులు, గృహస్తులకు అవసరమైన వివిధ సంప్రదాయ పూజ కార్యక్రమాలను నిర్దేశిత రుసుముతో నిర్వహిస్తున్నారు.

ఈ పురోహిత సంఘం ద్వారా వివాహం, ఉపనయనం, సత్యనారాయణ వ్రతం, నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, వాహన పూజ తదితర ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాలను తక్కువ ఖర్చుతో చేసుకునేవిధంగా టీటీడీ అందుబాటులో ఉంచింది. 

కళ్యాణ వేదిక వద్ద పురోహిత సంఘం ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు మరియు ఫీజులు ఇలా ఉన్నాయి:

  వివాహం – ఉచితం

  ఉపనయనం – రూ.300

  సత్యనారాయణ వ్రతం – రూ.300

  కేశఖండన – రూ.200

  నామకరణం – రూ.200

  అన్నప్రాసన – రూ.200

  అక్షరాభ్యాసం – రూ.200

  వాహన పూజ – రూ.200

  చెవిపోగులు కుట్టడం – రూ.50

  చెవిపోగులు కుట్టడం (కాటేజ్‌లో) – రూ.100

  మేళం (ఒక సెట్టు) – రూ.100

  మేళం (రెండు సెట్లు) – రూ.300

  దస్త్ర పూజ – రూ.200

  ఇతర ధార్మిక కార్యక్రమాలు – రూ.200

భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం తిరుమల కళ్యాణ వేదిక వద్దనున్న పురోహిత సంఘాన్ని సంప్రదించవచ్చు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.