కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ముగిసిన ”బాలాలయ సంప్రోక్షణ”
కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ముగిసిన ”బాలాలయ సంప్రోక్షణ”
తిరుపతి, 2021 జనవరి 25: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి చిత్ర పటాలకు బాలాలయ సంప్రోక్షణ సోమవారం ఉదయం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు యాగ శాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ఉదయం 9.15 గంటలకు కుంభ లగ్నంలో బాలాలయ చిత్రపటాలకు కుంభ ఆవాహన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ ఎన్ఎకె.సుందరవరదన్, కంకణబట్టార్ శ్రీ సీతారామాచార్యులు, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కుమార్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.