ANKURARPANAM HELD _ కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 15 May 2024: The Ankurarpanam fete was observed with religious fervour in Sri Konetiraya Swamy temple on Wednesday evening in Keelapatla of Palamaner in Chittoor district.
As the annual brahmotsavam are scheduled to commence from May 16 onwards, the Beejavapanam was conducted.
The important days includes Dhwajarohanam on May 16 in the auspicious Mithuna Lagnam between 9am and 9:40am.
Kalyanotsavam and Garuda Seva is on May 20, Vasanthotsavam on May 21, Rathotsavam on May 23 and Chakrasnanam on May 24. On May 25 Pushpayagam will be observed.
The Grihastas shall have to pay Rs. 500 per ticket on which two persons are allowed.
Devotional cultural programmes have been arranged during the annual fete by HDPP and Annamacharya Projects of TTD.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి, 2024 మే 15: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గజేంద్ర పాల్గొన్నారు.
మే 16న ధ్వజారోహణం :
మే 16వ తేదీ గురువారం ఉదయం 9 నుంచి 8.40 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ చంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గజేంద్ర పాల్గొన్నారు.
ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తేదీ
16-05-2024
ఉదయం – ధ్వజారోహణం(మిథున లగ్నం)
సాయంత్రం – శేష వాహనం
17-05-2024
ఉదయం – తిరుచ్చిఉత్సవం
సాయంత్రం – హంస వాహనం
18-05-2024
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
19-05-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
సాయంత్రం – సర్వభూపాల వాహనం
20-05-2024
ఉదయం – మోహినీ ఉత్సవం
సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం
21-05-2024
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం
22-05-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
23-05-2024
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం
24-05-2024
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం
ఉత్సవాల్లో భాగంగా మే 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.