CONSPIRACY TO MALIGN TTD- ADDNL.EO _ కుట్ర‌పూరిత అజెండాతోనే టిటిడిపై దుష్ప్ర‌చారం : అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

Tirumala, 31 Mar. 21: Seriously refuting the false propaganda on the human hair smuggling issue, TTD Additional EO Sri AV Dharma Reddy said, some vested interests had hatched a conspiracy to damage the reputation of the premier Hindu Religious Institution with a malicious campaign.

Releasing the documents of seizures made by Assam Rifles, Customs and the Mizoram police, the TTD Additional EO said TTD had no connection to the seized material.

Addressing a media conference at the Annamaiah Bhavan in Tirumala on Wednesday the Additional EO said in spite of all disclosures the vested interests were targeting TTD and AP Government through social media, print and electronic media and hurting the sentiments of the devotees.

He said the baseless charge was that TTD officials and Customs officials were clandestinely transporting the tonsured hair.

He said there was no reference or link to the TTD in the Rs.18, 17, 089 worth rotten human hair seized on February 8 by the Mizoram police. The police and customs reports categorically stated that the seizes hair were not linked to TTD at all and were also useless for processing.

But a section of media is making all-out efforts to damage the reputation of TTD and thereby hurting the sentiments of Hindu devotees across the globe.

The Additional EO said TTD had established a transparent and state of art technology to process treatment cum storage of tonsured hair. Not a single glade of hair is offered in e-auction without it’s processing.

He said the malafide campaigners had painted the officials of Kalyanakatta, TTD Vigilance and 1200 barbers as  ‘thieves ‘ and marked them guilty.

He said there baseless allegations of malpractices in the e-auction platform and invited the representatives of media to participate in the next auction of tonsured hair due in April and see for themselves whether there were any syndicates or room for malpractices in the sale proceedings.

The Additional EO said it was not good to malign a few TTD officials and employees by media for sake of cheap popularity. Where is need for TTD officials to transport Rs.18 lakh worth unprocessed spoiled hair in a truck 3000 kms away near Mizoram, he questioned.

He said the reports given by the Mizoram police clarified that the seized truck belonged to a Mizoram based lady who had paid the truck driver Rs.15, 000 to transport locally collected hair.

He said the cheap publicity had hurt the TTD employees mentally who were working in the division in spite of health hazards.

The Additional EO said police has been instructed to take stringent action on individuals and media organisations which resorted to baseless campaign on TTD.

He said if the media representatives proved their allegations after visiting Mizoram, TTD is ready to initiate necessary action.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

కుట్ర‌పూరిత అజెండాతోనే టిటిడిపై దుష్ప్ర‌చారం : అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

క‌స్ట‌మ్స్ అధికారులు, అస్సాం రైఫిల్స్ నివేదిక మీడియాకు విడుద‌ల

తిరుమ‌ల, 2021 మార్చి 31: ప్ర‌పంచ హిందువుల రాజ‌ధాని అయిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల‌పై కుట్ర‌పూరిత అజెండాతో కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మిజోరం – మ‌య‌న్మార్ స‌రిహ‌ద్దుల్లో క‌స్ట‌మ్స్ అధికారులు, అస్సాం రైఫిల్స్ సీజ్ చేసిన త‌ల‌నీలాల‌తో ఎటువంటి సంబంధం లేకపోయినా, టిటిడిని, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి కొంద‌రు వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలోను, ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాలోను అవాస్త‌వాలు ప్ర‌చారం చేసి భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తున్నార‌ని చెప్పారు. త‌ల‌నీలాల సీజ్‌కు సంబంధించి క‌స్ట‌మ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు స్థానిక పోలీసుల‌కు అందించిన నివేదిక‌ను ఆయ‌న మీడియాకు విడుద‌ల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధ‌వారం శ్రీ ఎవి.ధర్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

టిటిడి అధికారులు కుమ్మ‌క్కై త‌ల‌నీలాల‌ను అక్ర‌మ ర‌వాణా చేసిన‌ట్టు అభూత‌క‌ల్ప‌న‌లు చేశార‌ని చెప్పారు. టిటిడికి సంబంధం లేని విష‌యాల‌పై రుజువులు లేకుండా ప్ర‌చారం చేస్తూ టిటిడి ప్ర‌తిష్ట‌ను అభాసుపాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. దీనివ‌ల్ల భ‌క్తుల విశ్వాసాన్ని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు. ఫిబ్ర‌వ‌రి 8న మిజోరంలో సీజ్ చేసిన రూ.18,17,089/- విలువ చేసే తుక్కు త‌ల‌వెంట్రుక‌లకు సంబంధించి అధికారులు పోలీసుల‌కు ఇచ్చిన రిపోర్టులో ఎక్క‌డా టిటిడి పేరే లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పైగా సీజ్ చేసిన త‌ల‌నీలాలు ప్రాసెస్ చేయ‌నివిగా అందులో పేర్కొన్న‌ట్టు తెలిపారు.

టిటిడిలో త‌ల‌నీలాల సేక‌ర‌ణ‌, వాటి ప్రాసెసింగ్, ఈ-వేలం ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించ‌డానికి ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ ఉంద‌ని, ఇది పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. టిటిడి నుంచి ప్రాసెస్ కాకుండా ఒక్క వెంట్రుక కూడా బ‌య‌ట‌కు వెళ్లే అవ‌కాశ‌మే లేద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ల్యాణ‌క‌ట్ట‌, విజిలెన్స్ విభాగాల అధికారులు, సుమారు 1200 మంది క్షుర‌కులను ఇంటిదొంగ‌లుగా ఆరోపించి వారిపై బుర‌ద‌చ‌ల్లార‌ని చెప్పారు. ఈ-వేలంలో కూడా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు అవాస్త‌వ ప్ర‌చారం చేశార‌ని, ఏప్రిల్‌లో నిర్వ‌హించే ఈ-వేలానికి ఈ ఆరోప‌ణ‌లు చేసిన మీడియా ప్ర‌తినిధులు హాజ‌రై త‌ల‌నీలాలు ఎలా విక్ర‌యిస్తారో, సిండికేట్‌కు, అక్ర‌మాల‌కు అవ‌కాశం ఉందేమో ప‌రిశీలించుకోవ‌చ్చ‌న్నారు. ఇలాంటి చీప్ పాపులారిటీ కోసం నిజాయితీప‌రులైన అధికారులు, ఉద్యోగుల‌పై బుర‌ద‌చ‌ల్ల‌డం మంచిది కాద‌ని హిత‌వుప‌లికారు. రూ.18 ల‌క్ష‌లు విలువచేసే తుక్కు వెంట్రుక‌ల‌ను తిరుమ‌ల నుంచి 3 వేల కిలోమీట‌ర్ల దూరంలోని మిజోరంకు ట్ర‌క్కులో ఎవ‌రైనా త‌ర‌లిస్తారా అని ప్ర‌శ్నించారు.

త‌ల‌నీలాలు త‌ర‌లిస్తూ సీజ్ చేసిన ట్ర‌క్ మిజోరం రాష్ట్రానికి చెందిన‌ద‌ని, ఆ రాష్ట్రానికి చెందిన ఒక మ‌హిళ స్థానికంగా సేక‌రించిన ప్రాసెస్ చేయ‌ని త‌ల‌నీలాల‌ను ర‌వాణా చేయ‌డానికి డ్రైవ‌రుకు రూ.15 వేలు ఇచ్చిన‌ట్టు అధికారులు త‌మ రిపోర్టులో స్ప‌ష్టంగా పొందుప‌రిచార‌ని ఆయ‌న చెప్పారు. త‌ల‌నీలాల అమ్మ‌కం ద్వారా శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అధిక ఆదాయం తీసుకొచ్చేందుకు త‌మ ఆరోగ్యాన్ని సైతం ప‌ణంగా పెట్టి ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌ను కొందరు అవ‌మానించ‌డం, అభాండాలు వేయ‌డం మంచిది కాద‌న్నారు. టిటిడిపై సోష‌ల్ మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేసిన వ్య‌క్తులు, మీడియా సంస్థ‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు శ్రీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. మిజోరంలో సీజ్ చేసిన త‌లనీలాలు టిటిడివేన‌ని ఇప్ప‌టికీ దుష్ప్ర‌చారం చేయాల‌నుకునే మీడియా ప్ర‌తినిధులు మిజోరంకు వెళ్లి విచార‌ణ చేసి టిటిడి ప్ర‌మేయం ఉన్న‌ట్టు నిరూపిస్తే చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.