కోట్లిచ్చేవారికి కోరుకున్న సేవలు, అతిథిమర్యాదలు అని ప్రచురించిన వార్త వాస్తవం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ(తిరుపతి, డిశెంబర్-03, 2009)
కోట్లిచ్చేవారికి కోరుకున్న సేవలు, అతిథిమర్యాదలు అని ప్రచురించిన వార్త వాస్తవం కాదు
డిశెంబర్ 3వ తేదిన సాక్షి దినపత్రిక నందు ప్రచురించిన ‘శ్రీవారిసేవలకోసం సూపర్ మార్కెట్’ పాలకమండలి సాహసోపేత నిర్ణయం, కోట్లిచ్చేవారికి కోరుకున్న సేవలు, అతిథిమర్యాదలు అని ప్రచురించిన వార్త వాస్తవం కాదు.
తితిదేకి ఎన్నో అంశాలపై పలువురు నుండి పలుసూచనలు, సలహాలు వచ్చినపుడు వాటిని కక్షుణంగా పరిశీలించిన పిదప, పాలకమండలికి నివేదించే ముందు సంబంధిత అంశం ద్వారా భక్తులకు మేలు చేకూర్చగలదు అనుకున్నపుడే వాటిని బోర్డుకు నివేదించడం జరుగుతుంది. అదేవిధంగా సదరు వార్తలో తెలిపినట్లు శ్రీవారిసేవలకు సంబంధించి కేవలం అది సూచన మాత్రమే. అసలు ఈ అంశం బోర్డు దృష్టికి వెళ్ళలేదని, అటువంటి ఆలోచనలేదని తెలియజేస్తున్నాం. అయితే సదరువార్తలో పాలకమండలి సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు ప్రచురించడం కూడా పూర్తిగా అవాస్తవం.
కనుక ఈ విషయాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు