SRIVARI PUSHKARNI CLOSED TO AVOID COVID-19 SPREAD _ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు శ్రీవారి పుష్క‌రిణి మూత – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 18 Mar. 20: TTD has closed down the gates of Swamy Pushkarini in Tirumala as a measure to check the spread of Covid 19. TTD Additional Executive Officer, Sri A V Dharma Reddy said that as a part of anti Corona Virus campaign the TTD has decided to close down the Swami Pushkarani adjacent to Srivari temple from 12 noon of Thursday until further orders.

Speaking to media persons he said since the chances of spread of Corona virus is more with mass bathing by pilgrims in the Swamy Pushkarini, it is closed for devotees. Instead TTD has set up 18 shower baths with Pushkarini water for the sake of devotees. He said the surrounding areas of Pushkarini are also being sanitized with disinfectants every two hours daily.

Temple Dy EO Sri Harindranath, SE2 Sri Nageswara Rao, Heatlh Officer Dr RR Reddy, EE water works Sri Srihari, VGO Sri Manohar and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు శ్రీవారి పుష్క‌రిణి మూత – టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

 తిరుమల, 2020 మార్చి 18: తిరుమ‌లలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో బాగంగా గురువారం మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల నుండి శ్రీ‌వారి పుష్క‌రిణిని మూసివేస్తున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి పుష్క‌రిణిని గురువారం ఉద‌యం అద‌న‌పు ఈవో అధికారుల‌తో క‌లిసి త‌ణిఖీ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ శ్రీ‌వారి పుష్క‌రిణిలో భ‌క్తులు స్నానం చేస్తే క‌రోనా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఎక్కువ కావున పుష్క‌రిణిని మూసివేస్తున్న‌ట్లు తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో భ‌క్తుల ఆరోగ్యం దృష్ఠ్యా పుష్క‌రిణి నీటితో 18 ష‌వ‌ర్‌ బాత్‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. పుష్క‌రిణి నీటితో ఏర్పాటు చేసిన  ష‌వ‌ర్లలో స్నానం చేసిన‌, పుష్క‌రిణిలో స్నాన‌మాచ‌రిస్తే వ‌చ్చే పుణ్య‌ఫ‌లం ల‌భిస్తుంద‌న్నారు. పుష్క‌రిణి ప‌రిస‌రాల‌ను ప్ర‌తి రెండు గంట‌ల‌కు ఒక‌సారి అంటు రోగ నివార‌ణ మందుల‌తో శుభ్రం చేస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, ఎస్ఇ – 2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఆరోగ్య విభాగం అధికారి డా.ఆర్‌.ఆర్‌.రెడ్డి, ఇఇ వాట‌ర్క్స్ శ్రీ శ్రీ‌హ‌రి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.