VENUGOPALA ON GAJA _ గజ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం

Tirupati, 03 June 2024: On the sixth evening Sri Venugopala Swamy took out a celestial ride on Gaja Vahanam on Monday to bless His devotees.

AEO Sri Parthasaradhi, superintendent Sri Soma Sekhar and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

గజ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి దర్శనం

తిరుప‌తి, 2024 జూన్ 03: కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర‌వ రోజైన‌ సోమ‌వారం రాత్రి 7 గంటలకు గజ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.

మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతుల సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ శేఖ‌ర్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.