గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

తిరుమల, 2022 జనవరి 25: తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. తిరుమలలోని అద‌న‌పు ఈవో క్యాంపు కార్యాలయమైన ఈ భవనం ప్రాంగణంలో గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పొల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.