DO NOT GIVE DONATIONS DURING UMBRELLA PROCESSION- TTD _ గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి: టిటిడి

Tirumala, 04 September 2022: TTD has appealed to devotees not to contribute donations enroute the Umbrella procession coming from Chennai to Tirumala for participating in the Garuda Seva day during the ensuing Srivari annual Brahmotsavams.

 

The procession is not carried out by the temple management and the donations are no way connected with TTD.

 

TTD has also said it is a tradition that several Hindu organisations brings decorative umbrellas from Chennai and donate to Sri Venkateswara during the annual fete.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టిటిడి

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 04: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.

భక్తులు అందించే కానుకలు టిటిడికి చేరవని, కానుకలతో టిటిడికి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది.

సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.