UMBRELLAS TO REACH TIRUMALA ON SEP 21 _ గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టీటీడీ
Tirumala,20 September 2023: TTD on Wednesday appealed the devotees not to donate either in cash or kind during the procession of umbrellas coming from Chennai which will Tirumala on September 21.
In a statement, the TTD said such donations will not reach TTD and that TTD is not connected with Umbrella campaigns.
During the Srivari Brahmotsavam season, several Hindu organisations bring umbrellas to Tirumala and present them to the Srivari temple ahead of the prestigious Garuda Vahana Seva.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గొడుగుల ఊరేగింపులో భక్తులు కానుకలు ఇవ్వకండి : టీటీడీ
తిరుమల, 2023 సెప్టెంబరు 20: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబరు 21న తిరుమలకు చేరుకుంటాయి.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.