GOKULASHTAMI GO PUJA AT SV GOSHALA _ గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోశాలలో గోపూజ
Tirupati, 12 Aug. 20: The Go-Puja Mahotsavam at SV Goshala on the occasion of Gokulashtami was observed in a simple manner following COVID guidelines.
After the archakas tied the traditional Parivattam, the TTD EO garlanded the cow and its calf at the Go-puja mandir amidst chanting of Vedic mantras. Thereafter he offered fodder and grass to the bovine and performed circumambulation.
TTD Goshala Director Dr Harnath Reddy SE 1 Sri Jagdeeswara Reddy, VGO Sri Bali Reddy also participated.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గోకులాష్టమి సందర్భంగా ఎస్వీ గోశాలలో గోపూజ
తిరుపతి, 2020 ఆగస్టు 12: గోకులాష్టమి సందర్బంగా టీటీడీ ఎస్వీ గోశాలలో బుధవారం గోపూజ నిర్వహించారు. ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తొలుత శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజలో పాల్గొన్నారు.
అనంతరం అర్చకులు ఈఓ సింఘాల్ కు పరివట్టం కట్టి సాంప్రదాయబద్దంగా గోపూజా మందిరానికి తీసుకుని వెళ్లారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన గోవుకు ఈఓ పూలమాల వేసి, పసుపు, కుంకుమతో అలంకరించి అర్చకుల మంత్రోచ్చారణ మధ్య గోపూజ నిర్వహించారు. అనంతరం గోవులకు దాణా పెట్టారు. కోవిడ్ 19 నేపథ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అభిషేకం, అర్చన జరిగాయి.
ఈ కార్యక్రమంలో గోశాల డైరెక్టర్ శ్రీ హరనాథ రెడ్డి, ఎస్ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, విజిఓ శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది