SAFEGUARD COWS PROTECT CULTURE TTD CHAIRMAN _ గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం- ⁠టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

EVERYONE SHOULD INCULCATE GO SAMRAKSHANA

Tirupati, 16 January 2024:  TTD Chairman Sri Bhumana Karunakara Reddy called upon everyone to inculcate the habit of safeguarding cows to protect our culture as evinced in Vedas and Puranas.

Participating in the Go Puja Mahotsavam held at Sri Venkateswara Go Samrakshanasala in Tirupati as Chief Guest as part of Kanuma festivities the TTD chairman said TTD has been promoting the Gopuja program to empower the younger generation about the significance of the holy cow. 

He said TTD’s Goshalas at Tirupati and Palamner consisted of about 2500 cows, bulls, elephants and horses.

They stood as major attractions during the Utsavams of Tirumala and Tiruchanoor. Similarly, butter from desi cows is primarily used in all rituals and festivities of Tirumala.

He said Gopuja is significant in Kanuma festivities from time immemorial as the practice empowers devotees with prosperity, health and peace. The SV Gosamrakshana trust had received donations of ₹250 crore till date.

Earlier the TTD Chairman participated in other puja programs at Sri Venugopal Swamy temple, Tulasi Puja etc. Later he also fed fodder to Cows, Horses, Bulls, elephants etc. after performing puja to them.

  

The cultural programs, Annamaiah sankeertans and bhajans by artists of Annamacharya and Dasa Sahitya projects and students of SV College of music and Dance enthralled the devotees and citizens of Tirupati.

TTD Gosamrakshana Trust members Sri Srinivas Ram Sunil Reddy, Sri Sridhar, SVBC CEO Sri Shanmukh Kumar, Hindu Dharma Prachara Parishad Secretary Sri Dhananjeyulu and other officials, devotees participated in the program presided over by Dr Harnath Reddy, the Director of SV Goshala.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం
 
•⁠  ⁠గోమాత పరిరక్షణకుప్రతి ఒక్కరు ప్రతిన బూనాలి 
 
•⁠  ⁠టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి
 
తిరుపతి, 2024 జనవరి 16:   వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు  ప్రతిన బూనాలని టీటీడీ చైర్మన్  శ్రీ భూమన కరుణాకర రెడ్డి పిలుపు నిచ్చారు.  తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు .
 
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ సందర్బంగా గో మహోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.
 
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2,500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. తిరుమల శ్రీవారికి దేశీయ 
గో జాతుల పాల నుండి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.
 
పూర్వకాలం నుండి కనుమ పండుగ రోజున గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు.  ఇప్పటి వరకు దాతలు  రూ.250 కోట్లకు పైగా ”ఎస్వీ గో సంరక్షణట్రస్టు” కు విరాళాలు అందించినట్లు వివరించారు.
 
అంతకుముందు చైర్మన్ గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గౌరిపూజ, తులసిపూజ లో పాల్గొన్నారు. అటుతర్వాత గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, వాటికి  దాణా అందించారు.
 
ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులు, పురప్రజలను ఆకట్టుకున్నాయి. 
 
ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్‌ హరనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ గోసంరక్షణ ట్రస్టు సభ్యులు శ్రీ రాం సునీల్ రెడ్డి , శ్రీ శ్రీధర్, ఎవీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ సోమయాజులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.