TTD CHAIRMAN & THE EO ATTEND GOKULASTAMI CELEBRATIONS AT GOSHALA _ గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గో పూజ _ పాల్గొన్న టీటీడీ చైర్మన్ , ఈవో
Tirumala, 30 August 2021: As part of the Gokulastami celebrations, TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy participated in the festivities at SV Goshala in Tirupati on Monday.
After darshan of Sri Venugopal swami, they performed pujas to a well-decorated Desi Cow and a calf amidst chanting of Veda mantras and offered Harati.
They also performed the milching exercise and offered the milk to archakas for Abhishekam.
Thereafter they also visited Sri Venkateswara Maha mantra Japa Samarpana temple at Goshala and wrote Om Namo Venkatesaya in the book kept with the goal of gathering seven crore entries.
TTD CVSO Sri Gopinath Jatti, Additional CVSO Sri Siva Kumar Reddy, VGO Sri Manohar and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
గోశాలలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గో పూజ- పాల్గొన్న టీటీడీ చైర్మన్ , ఈవో
తిరుపతి 30 ఆగస్టు 2021: టీటీడీ గోశాలలో సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి గోశాల లోని శ్రీ వేణుగోపాలస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం గోమాత, దూడ కు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్ళి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
అనంతరం శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పుస్తక జపసమర్పణ (7 కోట్ల సార్లు ఓనమో వేంటేశాయ ) ఆలయాన్ని సందర్శించి అక్కడి పుస్తకంలో ఓం నమో వేంకటేశాయ అని రాశారు. సివి ఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అదనపు సివి ఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, విజిఓ శ్రీ మనోహర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది