TTD SUPPORT TO GO BASED ORGANIC FARMING- TTD EO _ గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు టిటిడి ప్రోత్సాహం – రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు – టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

– TTD STEPS TO BENEFIT G-ORGANIC FARMER

 

Tirumala, 20 Dec. 21: TTD EO Dr KS Jawahar Reddy has said that TTD will support all farmers who were engaged in Go based Organic farming and highlighted all TTD initiatives in the direction.

TTD has come forward to save the farmers from the financial unprecedented losses involved in farming with pesticides and fertilisers.

 

The highlights of the pro-Go-based organic farmers were as below

  1. TTD has begun the bulk purchase of jaggery, pulses, Desi cow ghee produced on organic formats after an MOU with the Organic farming department in the presence of AP CM Sri YS Jaganmohan Reddy on October 12 last.
  2. TTD provided free cows, bullocks to farmers engaged in organic farming for last 2-3 years to become financially independent.
  3. Besides giving barren cows to farmers for use in organic farming TTD is offering MSP for all organic products used by TTD in making daily Prasadam at Srivari temple.
  4. Till date TTD has provided 638 Desi breed bovines to farmers in both Telugu States which included 308 animals in Chittoor district (180 cows abs 128 bullocks) and distributed 330 animals in Nagar-Kurnool district.
  5. The marketing wing of the Nature farming department collected the organic crops from farmers and later processing the crops sent it to TTD on demand.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు టిటిడి ప్రోత్సాహం

– రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు

– టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 20: గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పోష‌కాల‌తో కూడిన ఆరోగ్య‌క‌ర‌మైన పంట ఉత్ప‌త్తులు పండించే రైతుల‌కు టిటిడి ప్రోత్సాహం అందిస్తోంద‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం టిటిడి చేప‌డుతున్న చ‌ర్య‌లు ఇలా ఉన్నాయి.

–  రైతులు త‌మ పంట‌ల కోసం ర‌సాయ‌నాల‌తో కూడిన ఎరువులు, పురుగుమందులు వాడ‌డం ద్వారా ఆర్థికంగా చితికిపోవ‌డంతో పాటు ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యానికి విఘాతం క‌లుగుతోంది. ప‌లువురు రైతులు అప్పుల పాలై ఆత్మ‌హ‌త్య‌ల‌కు కూడా పాల్ప‌డుతున్నారు. గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా ఇలాంటి రైతుల‌ను ఆదుకోవాల‌ని టిటిడి న‌డుం బిగించింది.

–   ఇందులో భాగంగా టిటిడికి అవసరమయ్యే ముడి సరుకుల్లో శనగలు, బెల్లం, దేశీయ ఆవునెయ్యి, బియ్యం లాంటివి గో ఆధారిత వ్యవసాయంతో పండించిన రైతుల నుంచి కొనుగోలు చేయడానికి అక్టోబ‌రు 12న తిరుమ‌ల‌లో ముఖ్య‌మంత్రి గౌ. శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ, ప్రకృతి వ్యవసాయ శాఖలతో టిటిడి ఎంఓయు కుదుర్చుకుంది.

– గో ఆధారిత వ్య‌వ‌సాయాన్ని మూడేళ్లు, రెండేళ్లు, ఒక సంవ‌త్సర కాలంగా చేప‌డుతున్న‌రైతుల‌కు ప్రాధాన్యత‌ల‌వారీగా ఉచితంగా ఆవులు, ఎద్దులను టిటిడి అందిస్తోంది. వీటిని వ్య‌వ‌సాయ‌, అనుబంధ రంగాల్లో వినియోగించుకోవ‌డం ద్వారా రైతులు ఆర్థికంగా ల‌బ్ధిపొందుతున్నారు.

– అదేవిధంగా, వ‌ట్టిపోయిన ఆవుల‌ను కూడా రైతుల‌కు అందిస్తుండ‌డం ద్వారా  గో ఆధారిత ప్ర‌కృతి వ్యవసాయానికి వీటిని వినియోగిస్తున్నారు. ఈ విధానంలో పండించిన శనగలు, బెల్లం, దేశీయ ఆవునెయ్యి, బియ్యం త‌దిత‌ర స‌రుకులకు గిట్టుబాటు ధ‌ర చెల్లించి టిటిడి కొనుగోలు చేస్తుంది. గో ఆధారిత ప్ర‌కృతి వ్యవసాయ పంట ఉత్ప‌త్తుల‌ను తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే కైంక‌ర్యాలు, ప్ర‌సాదాల త‌యారీ కోసం వినియోగిస్తారు.

– ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు రాష్ట్రాల్లో 638 దేశ‌వాళీ ప‌శువుల‌ను రైతుల‌కు ఉచితంగా అందించ‌డం జరిగింది. చిత్తూరు జిల్లాలో 308 ప‌శువుల‌ను అందించ‌గా, వీటిలో 180 ఆవులు, 128 ఎద్దులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో 330 ప‌శువుల‌ను అందించారు.

– రైతులు పండించిన పంట ఉత్ప‌త్తుల‌ను మొద‌ట ప్ర‌కృతి వ్య‌వ‌సాయ శాఖ మార్కెటింగ్ విభాగం సేక‌రిస్తుంది. పంట ఉత్ప‌త్తుల‌ను నిల్వ ఉంచి ప్రాసెస్ చేసి ముడిస‌రుకుల‌ను అవ‌స‌రాన్ని బ‌ట్టి టిటిడికి అందిస్తుంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.