TTD EO REVIEWS GO MAHA SAMMELAN ARRANGEMENTS _ గో మ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో స‌మీక్ష‌

Tirumala, 13 October 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Wednesday reviewed the arrangements for conducting the Go Maha Sammelan at Tirupati on October 30-31 as part of TTD dedicated campaign to promote awareness on Go Samrakshana and Go-based organic farming practices in the country.

 

Speaking on the occasion the TTD EO said since Pontiffs of mutts from both south and north India are being anticipated to participate in the two day Go Sammelan, he asked officials to chose either the Mahati auditorium or Srinivasa auditorium at SV university for the mega meet.

 

He directed officials to make all arrangements in total adherence to covid guidelines as nearly 1000 farmers are expected to participate in the conference daily. He directed them to organise separate committees for Reception, Transport, Food, Accommodation and others for smooth conduct of the Sammelan.

 

Additional EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, CE Sri Nageswara Rao, Yuga Tulasi foundation chairman and TTD board ex-member, Sri Siva Kumar, Goshala director Dr Harnath Reddy, Organic farmers Sri Vijay Ram, Sri Ramesh Gupta and others were also present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గో మ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో స‌మీక్ష‌

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 13: దేశీయ గోజాతుల సంర‌క్ష‌ణ‌, గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డమే ల‌క్ష్యంగా అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలో నిర్వ‌హించ‌నున్న గో మ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌పై టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి బుధ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారికి గో ఆధారిత నైవేద్యాన్ని శాశ్వ‌తంగా అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలో గో మ‌హాస‌మ్మేళ‌నం కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కు ఎస్వీయు శ్రీ‌నివాస ఆడిటోరియం లేదా మ‌హ‌తి ఆడిటోరియంను ప‌రిశీలించి ఒక‌టి ఎంపిక చేయాల‌న్నారు. ద‌క్షిణాదితోపాటు ఉత్త‌రాది నుంచి స్వామీజీలు, మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు వ‌స్తున్నార‌ని అన్నారు. ఈ స‌మ్మేళ‌నంలో కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ మొద‌టి రోజు వెయ్యి మంది, రెండ‌వ రోజు వెయ్యి మంది రైతులు హాజ‌ర‌వుతార‌ని,  ఇందుకు త‌గ్గ‌ట్టు ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. ఇందుకోసం రిసెప్ష‌న్ క‌మిటీ, ర‌వాణా క‌మిటీ, ఫుడ్ క‌మిటీ, అకామిడేష‌న్ త‌దిత‌ర క‌మిటీలు ఏర్పాటు చేయాల‌న్నారు.

ఈ స‌మావేశంలో అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు శ్రీ విజ‌య్‌రామ్‌, శ్రీ ర‌మేష్ గుప్తా, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.