ఘనంగా ముగిసిన దక్షిణ భారత సంగీత, నృత్యోత్సవంDAKSHINA BHARAT SANGEETA NRITYA MAHOTSAVAM –  KALAVAIBHAVAM CONCLUDES AT TIRUPATIఘనంగా ముగిసిన దక్షిణ భారత సంగీత, నృత్యోత్సవం

  CAuO SRI SHESHA SHAILENDRA IMPLORES ARTISTS TO HERALD SOUL IN FINE ARTS

Tirupati, 16 February 2024: TTD CAuO Sri Shesha Shailendra expounded the need for spreading the traditional Indian conventional fine arts ( music and dance) to empower global future generations.

Addressing the concluding ceremony of the three-day Kala Vaibhavam jointly organised by SV College of Music and Dance, SV Nadaswaram and Dolu School at the Mahati  Auditorium in Tirupati on Friday evening, Sri Sesha Shailendra said it is the responsibility of every citizen to preserve and protect the ancient fine arts. 

Earlier eminent Mrudangam Maestro Padma Sri Yella Venkateswara Rao said the SV College of Music and Dance which has produced countless reputable artists should be granted University status. He said TTD is successfully running the fine arts institution from the past six decades and has played a stellar role in promoting Education, Medicare and fine arts sectors.

EVENING OF CULTURAL FEAST 

It was an evening of a cultural feast with spectra of arts forms showcasing a Carnatic vocal concert presented by Madras University students, Central University professor Dr Hemalata team and instrumental music by students of SV Government Sangeet and Fine Arts College.

Among others, the Sri Krishna Leela Vilasam by students of SV Sangeet and dance college, ‘Srirama Katha Saram’ by students of  Dr Pasumarti Ramalinga Shatari, retired professor of Central University held the audience spellbound with the performance.

TTD Asthana Vidhwan Dr Garimella Balakrishna Prasad, DEO Dr Bhaskar Reddy, College Principal Dr Uma Muddubala and a large number of students and faculty were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఆత్మ వంటి భారతీయ సాంప్రదాయ కళలను భావితరాలకు అందించాలి

– ముఖ్య గణాంకాధికారి, కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేషశైలేంద్ర

– విశ్వ‌విద్యాల‌యం స్థాయికి ఎస్వీ సంగీత నృత్య కళాశాల

– పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు

– సంగీత, నృత్య కార్య‌క్ర‌మాలతో పులకించిన తిరునగరి

•⁠ ⁠ఆకట్టుకున్న హైదరాబాద్ కు చెందిన కళాకారుల ” శ్రీరామ కథా సారం” నృత్య రూపకం

•⁠ ⁠ఘనంగా ముగిసిన దక్షిణ భారత సంగీత, నృత్యోత్సవం

తిరుప‌తి, 2024 ఫిబ్ర‌వ‌రి 16: భార‌తీయ సమాజానికి ఆత్మ వంటి పురాత‌న సంస్కృతి, సాంప్ర‌దాయాలైన సంగీత‌, నృత్య క‌ళ‌ల‌ను విశ్వ‌వ్యాప్తం చేసి, భ‌విష్య‌త్ త‌రాల‌కు అందించాల‌ని సిఈవో శ్రీ శేష శైలేంద్ర విద్యార్థులకు పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళామందిరంలో కళావైభవం పేరిట నిర్వహిస్తున్న దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం శుక్రవారం ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా సిఈవో మాట్లాడుతూ, మ‌న వేదాల‌లో ఉన్న‌ పురాతన కళ‌లను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భారతదేశం భరతనాట్యం, కూచిపూడి తదితర నాట్యాలు సంగీత వాద్య కళ‌ల సమూహమ‌న్నారు. భార‌తీయ జీవన విధానం మన సంస్కృతిపై ఆధారపడి ఉంటుంద‌ని, మన సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను నిలబెట్టిన సనాతన మహర్షులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మన వేదాల్లోని సంస్కృతిని క‌ళాకారులు ఏ విధంగా ప్రదర్శించాలి, తదితర అంశాలను వివరించారు.

అంతకుముందు పద్మశ్రీ శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ, ప్రపంచానికి ఎంతోమంది కళాకారులను అందించిన ఎస్వీ సంగీత నృత్య కళాశాల విశ్వవిద్యాలయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన టీటీడీ విద్య, వైద్య, సంగీత రంగాలలో విశేష కృషి చేస్తుందని వివరించారు.

ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం త్రిపునితరకు చెందిన ఆర్. ఎల్ .వి.ప్రభుత్వ సంగీత మరియు ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు వీణ, వేణువు, మృదంగం, వయోలిన్, ఘటం వాద్యాలతో పంచ వాద్య సంగీతాన్ని లయబద్ధంగా ప్రదర్శించారు.

అంతకుముందు మద్రాస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రేమలత బృందం గాత్ర సంగీతం విశేషంగా ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న “శ్రీ కృష్ణ లీలా విలాసం” నృత్యరూపకం

శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి శశికళ శిష్య బృందం “శ్రీ కృష్ణ లీలా విలాసం” నృత్య రూపకం ప్రేక్షకులను రంజింప జేసింది.

తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాల, తిరువయూర్ విద్యార్ధులు
నాదస్వర, వీణ, వయోలిన్, మృదంగం, డోలు వాద్యముల సంగీతం ఆహుతులను మైమరిపించింది.

“శ్రీ రామ కథాసారం” కూచిపూడి నృత్యరూపకం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి శిష్యులు ప్రదర్శించిన “శ్రీ రామ కథాసారం” కూచిపూడి నృత్యరూపకం రంజింపజేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఆస్థాన విధ్వంసులు డా. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, డీఈవో డా. భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఉమా ముద్దుబాల, సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక కళా ప్రియులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.