GRAND FINALE OF PURANDARA DASA ARADHANOTSAVAM _ ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
Tirumala, 02 February 2022: The three-day-long fete organised by the TTD Dasa Sahitya project, Sri Purandhara Dasa Aradhanotsavam concluded on a grand note at Asthana Mandapam in Tirumala on Wednesday morning.
The Special Officer of Dasa Sahitya Project Sri Anandathirthacharyulu said all devotees should serve God to redeem their past and attain Moksha.
He said Sri Purandhara Dasa has penned 4.75 lakh Sankeetans.
Earlier Dasa Sahitya project artists presented bhajans followed by sankeetans of Purandara Dasa.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
తిరుమల. 2022 ఫిబ్రవరి 02: తిరుమలలో గత మూడురోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు బుధవారంనాడు ఆస్థాన మండపంలో ఘనంగా ముగిశాయి.
దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ మానవ జీవన విధానంలో ఎదురయ్యే సమస్యలకు పూర్వజన్మ కర్మ ఫలమే కారణమన్నారు. దీని నుండి బయట పడటానికి మహత్ములను సందర్శించి వారి మార్గదర్శకంలో భగవంతుడిని సేవించడం ద్వారా మోక్షం పొందవచ్చని వివరించారు.
అదేవిధంగా శ్రీ పురందరదాసులవారు జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురందరదాసు కీర్తనలు యావత్తూ లోకోక్తులేనన్నారు. మానవాళికి పురందరదాసు జీవితసారమే ఆదర్శప్రాయమన్నారు.
అంతకుముందు ఉదయం 6.00 నుండి 7.30 గంటల వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు హరిదాస రసరంజని కళాకారులతో పురందరదాస సంకీర్తనలను గోష్ఠిగానం ఆలపించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.