ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంధి పవిత్ర సమర్పణ

ఘనంగా శ్రీ కపిలేశ్వరస్వామివారికి గ్రంధి పవిత్ర సమర్పణ

తిరుపతి, జూలై 20, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి గ్రంధి పవిత్ర సమర్పణ ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఉదయం 8.00 నుండి 12.00 గంటల వరకు హోమం, గ్రంధి పవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9.00 గంటల వరకు యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రూ.500/- చెల్లించి ఇద్దరు గృహస్తులు ఒక రోజు పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, సూపరింటెండెంట్‌ శ్రీ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శ్రీనివాసులు, శ్రీ సురేష్‌,  ప్రధాన అర్చకులు శ్రీ ఉదయా గురుకుల్‌, శ్రీ స్వామినాధ్‌ గురుకుల్‌, శ్రీ మణివాసగురుకుల్‌, శ్రీ చంథ్రేఖర్‌ గురుకుల్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
             
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.