ANNAMAIAH GOSTI GANAM MESMERISES _ ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం
– ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 20224 మే 23: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం విశేషంగా ఆకట్టుకుంది.
ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు…, నారాయణ తే నమో నమో నారద సన్నుత నమో నమో, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు…., హరి అవతారమితడు అన్నమయ్య…..” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.
సాయంత్రం 6 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ ఫణి నారాయణ, శ్రీమతి పూర్ణిమ బృందం సంగీత సభ, రాత్రి 7 గంటలకు టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, టీటీడీ అధికారులు, కళాకారులు, విశేష సంఖ్యలో పుర ప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.