176th SRI THYAGARAJA ARADHANA FETE HELD WITH GRANDEUR _ ఘనంగా శ్రీ త్యాగరాజస్వామి 176వ ఆరాధనోత్సవాలు

SANKEERTANA TRIBUTES PAID TO THE SAINT COMPOSER- MUSICIAN

Tirupati,12 January 2023: Sankeertana Tributes were paid to Nada Brahma, Sangeetha Pitamaha, one among the Trinity of Carnataka Sangeetha, Sri Tyagaraja Swamy on the occasion of his 176th Aradhana Mahotsavam held at Sri Venkateswara College of Music and Dance in Tirupati on Thursday.

Participating the in the celebrations jointly organised by the Sri Venkateswara Nadaswara Pathashala and Sri Venkateswara College of Music and Dance of TTD, the CVSO Sri Narasimha Kishore said “the Tyagaraja Pancha Ratna Sankeetans” are all time encyclopedia for those who are pursuing carnatic music. 

Earlier students of faculty members of both the institutions performed special pujas to statues of Sri Vigneswara, Sri Sita Lakshmana Hanumanta sameta Sri Ramachandra Murthy, Sri Venkateswara and Sri Thiyagaraya Swamy located at the premises with Mangala Vaidyam.

Thereafter the  students and teachers presented Nadaswaram followed by the famous Pancha Ratna Sankeetans akin to Thiruvayur Aradhanotsavams in a grand manner.

TTD DEO Sri Bhaskar Reddy, DyEO Sri Govindarajan, SV music college principal Sri Sudhakar, Annamacharya Project Director Dr Vibhishana Sharma, faculty members, old students, local music exponents and students participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా శ్రీ త్యాగరాజస్వామి 176వ ఆరాధనోత్సవాలు
 
– వాగ్గేయకార చక్రవర్తికి సంకీర్తనల స్వరమాల
 
తిరుపతి, 2023 జనవరి 12: వాగ్గేయకార చక్రవర్తి సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం సంకీర్తనల స్వరమాల వేసి నివాళులు అర్పించింది. ఆయన 176వ ఆరాధనోత్సవాన్ని గురువారం శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించింది.  శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీవేంకటేశ్వర నాదస్వర పాఠశాల ఆధ్వర్యంలో  ఈ ఉత్సవం నిర్వహించారు.
   
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సివిఎస్వో  శ్రీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ,  శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతులను ప్రతి ఒక్కరు నేర్చుకుని, రాబోవు తరాలకు అందించాలన్నారు. ప్రతి  కుటుంబంలో ఒక్కరైనా సంగీతం, సాహిత్యం, నృత్యం నేర్చుకోవడం వల్ల ఆ కుటుంబాలు సుఖ సంతోషాలు, సౌభాగ్యాలతో ఉంటాయన్నారు. రాబోవు రోజుల్లో వేలాదిమందితో నగర సంకీర్తనగా పంచరత్న కృతులను ఆలపించాలన్నారు. 
 
అంతకు ముందు ఉదయం 8 గంటలకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రాంగణంలోని శ్రీ విఘ్నేశ్వ‌ర‌, హ‌నుమ‌త్స‌మేత సీతారామ‌ల‌క్ష్మ‌ణుల‌కు, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, శ్రీత్యాగరాజస్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నాదస్వర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు  మంగళవాయిద్య నీరాజనం సమర్పించారు. 
 
ఉదయం 10 గంటల నుండి శ్రీ వేంకటేశ్వర నాదస్వ‌ర పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులచే నాదస్వర కచ్చేరి నిర్వహించారు.
 
ఎస్‌.వి.సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ త్యాగరాజ పంచరత్న కృతులు” సుమధురంగా ఆలపించారు. 
 
తిరువయ్యారు తరహాలో పంచరత్న కృతుల బృందగానం : 
 
 తమిళనాడులోని తిరువయ్యారు తరహాలో నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి ఘనరాగ పంచరత్న కృతుల బృందగానం సంగీతప్రియులను అలరించింది. 
 
ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అన్నమాచార్య ప్రాజె క్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీ సుధాకర్, కళాశాల  అన్ని విభాగాల అధ్యాపకులు,  కళాశాల పూర్వ విద్యార్థులు , స్థానిక సంగీత విద్వాన్సులు , విద్యార్థులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.