SOMASKANDA SHINES ON SOMA VAHANA _ చంద్రప్రభ వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి అభయం
TIRUPATI, 12 FEBRUARY 2023: Sri Somaskandamurty shined in all His religious splendour on Chandraprabha Vahanam on Sunday evening to bless His devout.
On the second day evening the Chandraprabha Vahanam took place in a grand manner.
Deputy EO Sri Devendra Babu and other temple staff were also present.
చంద్రప్రభ వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి అభయం
తిరుపతి, 12 ఫిబ్రవరి 2023: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన ఆదివారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి చంద్రప్రభ వాహనంపై అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.
ఈ సందర్భంగా సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల ఆధ్వర్యంలో శ్రీ కేశన్న, శ్రీ కృష్ణమూర్తి బృందం మంగళధ్వని వినిపించారు. అదేవిధంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలిసి భక్తి సంగీత బృందగానం చేశారు. ఆ తర్వాత కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు భాగవతార్ హరికథా పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, ఏఈఓ శ్రీ పార్థ సారధి, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ రవికుమార్, శ్రీ బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.