GT BTU CONCLUDES _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి చక్రస్నానం 

TIRUPATI, 03 JUNE 2023: The annual brahmotsavam in Sri Govindaraja Swamy temple concluded on a grand religious note on Saturday with Chakrasnanam.

The processional deities of Sri Govindaraja, Sridevi and Bhudevi along with Sudarshana Chakrattalwar were rendered Snapanam in Kapilathirtham. Later the Chakrattalwar was rendered a holy dip amidst the chanting of Vedic hymns in the holy waters of the temple tank. Later the deities proceeded to PR Tota located opposite TTD Administrative Building 

In the evening from PR Tota, they will reach Sri Govindaraja Swamy temple. The annual fete will conclude with Dhwajavarohanam in the evening.

Both the seers of Tirumala, Kankanabhattar Sri Srinivasa Deekshitulu, DyEO Smt Shanti and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి చక్రస్నానం

ముగిసిన బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 జూన్ 03: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం చక్రస్నానంతో ముగిశాయి.

ఉదయం 6 గంటలకు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, చక్రత్తాళ్వార్‌ ఆలయం నుండి ఊరేగింపుగా బయల్దేరి కపిలతీర్థంలోని ఆళ్వార్‌ తీర్థానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అక్కడ స్నపనతిరుమంజనం అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుట గల పి.ఆర్‌.తోటకు వేంచేశారు.

సాయంత్రం 5 గంటలకు స్వామి పి.ఆర్‌.తోట నుండి ఊరేగింపుగా బయల్దేరి
శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.40 గంటల నుండి 9.30 గంటల వరకు నిర్వహించే ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, కంకణభట్టార్ శ్రీ ఏపి శ్రీనివాస దీక్షితులు, డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ రవి కుమార్, సూపరింటెండెంట్ శ్రీ మోహన్ రావు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.