CHAKRASNANAM HERALDS END OF SRI GT BUTs _ చక్రస్నానంతో ముగిసిన  శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 5 Jun. 20: The Nine-day annual Brahmotsavams of Sri Govindarajaswami temple on Friday with the chakra snanam event within the temple premises performed in a huge vessel Gangalam.

Earlier the utsava idols of Sri Govindaraja Swami and his consorts were offered Snapana Tirumanjanam inside the temple mandapam amidst chanting of Veda mantras and a gala of Vaidyams.

Sri Sri Sri Pedda Jeeyar Swami and Sri Sri Sri Chinna Jeeyar Swami, Special Grade Dyeo Smt Varalakshmi, Chief archaka and Kangana bhattar Sri AP Srinivasa Dikshitulu participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చక్రస్నానంతో ముగిసిన  శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి , 2020 జూన్ 05: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.

ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ భ‌ట్టార్ ఏ.పి.శ్రీ‌నివాస‌దీక్షితులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.