CHINNA SESHA VAHANAM HELD _ చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
Tirupati, 21 Feb. 22: The processional deity of Sri Kalyana Venkateswara Swamy decked as Murali Krishna blessed devotees on Chinna Sesha Vahanam on the second day morning as part of ongoing annual Brahmotsavams on Monday at Srinivasa Mangapuram.
Later Snapana Tirumanjanam was performed to the deities.
JEO Sri Veerabrahmam, DyEO Smt Shanti, AEO Sri Gurumurthy, Superintendents Sri Ramanaiah, Sri Chengalrayalu, temple priest Sri Balaji Rangacharyulu were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
చిన్నశేషవాహనంపై శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 21: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది.
రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.
స్నపన తిరుమంజనం :
అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ విష్ణుభట్టాచార్యులు, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, కంకణ భట్టార్ శ్రీ శేషాచార్యులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.