VENUGOPALA ON CHINNA SESHA _ చిన్నశేషవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి 

TIRUPATI, 01 JUNE 2023: On the second day morning as part of an ongoing annual festival in Appalayagunta, the processional deity of Sri Prasanna Venkateswara took out a celestial ride on the five-hooded Chinna Sesha Vahanam on Thursday.

The Utsava deity decked as Sri Venugopala Swamy blessed His devotees all along the four mada streets.

In the evening Unjal Seva will be observed. Devotees have been participating in all the rituals with religious ecstasy braving scorching temperatures.

DyEO Sri Govindarajan, AEO Sri Prabhakar Reddy, Superintendent Smt Srivani, and temple inspector Sri Siva Kumar were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చిన్నశేషవాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి

తిరుపతి, 2023 జూన్ 01: అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం.

సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్. పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.