KSHEERADHIVASAM HELD IN CHENNAI TEMPLE _ చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

TIRUPATI, 15 MARCH 2023: As part of ongoing consecration rituals in Sri Padmavathi Ammavari temple coming up at GN Chetti Road in Chennai, the Ksheeradhivasam ritual was held on Wednesday.

 

Ksheeradhivasam is an Agamic ritual where in special abhishekam with milk was rendered in the evening after performing Chatustanarchana, Murti Homam, Prayaschittam, Purnahuti, Karmanga Snapanam, Vimana Nayanonmeelanam under the supervision of Pancharatra Agama Advisor Sri Srinivasacharyulu.

 

Chennai Local Advisory Committee President Sri Sekhar Reddy, DyEO Sri Vijay Kumar and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా క్షీరాధివాసం

తిరుపతి, 15 మార్చి 2023: చెన్నై నగరంలోని జిఎన్ చెట్టి వీధిలో టిటిడి నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాకుంభాభిషేకం కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేశారు. టిటిడి పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం చతుష్టానార్చన, మూర్తిహోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, కర్మాంగస్నపనం, విమాన నయనోన్మీలనం నిర్వహించారు. సాయంత్రం క్షీరాధివాసం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.