జనవరి 11న ”తిరుప్పావై పాశురాల” పై పోటీలు 

జనవరి 11న ”తిరుప్పావై పాశురాల” పై పోటీలు
 
తిరుపతి, జనవరి 01, 2013: తితిదే ఆళ్వారు దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్వంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జనవరి 11వ తేదీన తిరుప్పావై పాశురాల అనుసంధాన పోటీలు నిర్వహించ నున్నారు.
 
గోదాదేవి శ్రీవారిని కీర్తించిన తిరుప్పావై పాశురాలను పవిత్రమైన ధనుర్మాసంలో ఆలపించడం ఆనవాయితీ. ఐదు నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ  విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన విద్యార్థులు అన్నమా చార్య కళామందిరంలో ఉదయం 9.00 గంటలకు నేరుగా పాల్గొనవచ్చు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.