‌KANUMA GOPUJA AT SV GOSHALA ON JANUARY 16 _ జనవరి 16న ఎస్వీ గోశాల‌లో క‌నుమ గోపూజ‌

Tirupati, 14 January 2024: Gopuja will be held grandly at Sri Venkateswara Gosamrakshanasala in Tirupati on January 16 in connection with the Kanuma festival.

On this occasion, TTD has arranged special devotional cultural programs besides Gopuja, Venugopala Puja followed by the distribution of Prasadams.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 16న ఎస్వీ గోశాల‌లో క‌నుమ గోపూజ‌

తిరుప‌తి, 2024 జనవరి 14: సంక్రాంతి క‌నుమ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 16వ తేదీ మంగ‌ళ‌వారం తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ‌ ఘనంగా జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు వేణుగానం, ఉదయం 8 గంటలకు వేదపారాయణం, దాసాహిత్య ప్రాజెక్టు కళాకారులతో కోలాటం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంకీర్తనల అలాపన నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు శ్రీవేణుగోపాలస్వామివారి సన్నిధిలో గోపూజ, శ్రీ వేణుగోపాలస్వామి హారతి, తులసి పూజ, గొబ్బెమ్మ వేడుక, గ‌జ‌పూజ‌, అశ్వపూజ, వృషభ పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో సంక్రాంతి హ‌రిదాసులు, బ‌స‌వ‌న్న‌ల నృత్య కార్య‌క్ర‌మం ఉంటుంది. ఆ త‌రువాత‌ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గోవులకు బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా తినిపించే అవకాశాన్ని టీటీడీ కల్పించడం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల చేయబడినది.