SRIVARI PARVETA FESTIVAL ON JANUARY 16 _ జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Tirumala, 14 January 2024: The famous mock hunt festival of Parveta Utsavam will be observed on January 16, on the day of the Kanuma festival. On the same day, Goda Parinayotsavam will also be performed.

       

On the occasion of Goda Parinayotsavam, the garlands of Andal will be taken from the Sri Sri Sri Pedda Jeeyar Swamy Mutt to the Srivaru temple in a procession through the four mada streets in Tirumala at 9am. 

Later at 1 pm, Sri Malayappa Swamy and Sri Krishna Swamy will be taken to the Paruveta Mandapam. 

Asthanam and hunting programs are held there.  After that, the deities reaches the temple in the evening.

All arjita sevas remains cancelled on that day including the Ashtadala Padapadmaradhana, Kalyanotsavam, Unjalseva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

తిరుమల, 2024 జనవరి 14: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.

గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్‌స్వామి మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.