జూన్‌ 12వ తేదిన ఈనాడు దినపత్రిక నందు తిరుమలలో పెద్దలదే పెత్తనం! ప్రైవేటు అతిధి గృహాల ఇష్టారాజ్యం ‘చేతులెత్తేసిన తితిదే’ అనువార్త నిజం కాదు.

తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి.

                                               వివరణ

        జూన్‌ 12వ తేదిన ఈనాడు దినపత్రిక నందు తిరుమలలో పెద్దలదే పెత్తనం! ప్రైవేటు అతిధి గృహాల ఇష్టారాజ్యం ‘చేతులెత్తేసిన తితిదే’ అనువార్త నిజం కాదు.

         తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించిన అనేక అంశాలపైన కూలంకషంగా చర్చించి పాలకమండలికి తగిన సలహాలు ఇవ్వడానికి తి.తి.దే.,పాలకమండలి సబ్‌ కమిటీలు ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే, ఈ నెల 11వ తేదిన తి.తి.దే.,పాలకమండలి ఏర్పాటు చేసిన ఒక సబ్‌కమిటి తి.తి.దే.,పరిపాలనాభవనంలో మీటింగు హాలులో సమావేశమై తిరుమలలో కాటేజీలు నిర్వహణ, వాటి కేటాయింపులకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించడం జరిగింది. దాతలు అతిథిగృహాలు నిర్మించే సమయంలో యున్న నిబంధనలు, యితర అగ్రిమెంట్లు తదితర అంశాలను పరిశీలించి, పాలకమండలి ఒక విధాన నిర్ణయం తీసుకోవడానికి వీలుగా సబ్‌కమిటి తన నివేదికను అందజేస్తుంది.

        బుధవారంనాడు సమావేశమైన సబ్‌కమిటి ఇంకా తన నివేదికను అందజేయాల్సియుంది. నివేదకను పూర్తిగా పరిశీలించిన తరువాతనే పాలకమండలి తగిన నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి సబ్‌కమిటి నివేదక ఇవ్వకుండానే, పాలకమండలి పరిశీలనలోకి రాకముందే ”తి.తి.దే చేతులెత్తేసింది” అని పేర్కొనడం పూర్తిగా అవాస్తవం, ఊహాజనితం.

         కనుక పై విషయాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరంగా ప్రచురించాల్సిందిగా కోరుచున్నాము.


ప్రజాసంబంధాల అధికారి,
తి.తి.దేవస్థానములు,
తిరుపతి.
———————————–