‌JUNE QUOTA DETAILS _ జూన్ నెల శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌

TIRUMALA, 13 MARCH 2024:  For the convenience of Srivari devotees, details of darshanam, arjita seva tickets, Srivari seva quota will be released online for the month of June.

* Registration for Srivari Arjita Seva Tickets in Luckydip from 18th March 10 am to 20th March 10am. The tickets have to be finalized by paying the money before 12 noon on 22nd March. 

* On 21st March at 10 am, tickets for Srivari Arjitasevas Kalyanotsavam, Unjalseva, Arjita Brahmotsavam, Sahasradeepalankara Seva tickets will be released.

* To participate in Jyeshtabhishekam to be held from June 19 to 21 tickets will be made available in online on March 21 at 10am.

– On March 21 at 3 PM, the quota of virtual services of Srivari Kalyanotsavam, Oonjalseva, Arjita Brahmotsavam, Sahasradipalankara Seva tickets, darshan tickets will be released.

– Angapradakshinam tokens will be available on March 23 at 10 am.

– SRIVANI Trust darshan and rooms quota will be released on March 23rd at 11 am.

– On March 25 at 10 am, Rs.300/- special entry darshan tickets will be made available to devotees.

– Room quota in Tirumala and Tirupati will be released on March 25 at 3 PM.

– Srivari Seva voluntary service in Tirumala, Tirupati quota will be released on March 27 at 11 AM, Navanitha Seva at 12 Noon and Parakamani Seva at 1 PM on the same day.

-It is requested to book all the above online quota through the TTD official website https://ttdevasthanams.ap.gov.in.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ నెల శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా విడుద‌ల‌

తిరుమల, 2024, మార్చి 13: తిరుమ‌ల శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ నెల‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ ద‌ర్శ‌నం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవ కోటా వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 18వ తేదీ ఉద‌యం 10 నుండి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల‌ ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

– మార్చి 21వ తేదీ ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

– జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

– మార్చి 21న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీ‌వారి వ‌ర్చువ‌ల్ సేవ‌లైన క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవా టికెట్లు, ద‌ర్శ‌న టికెట్ల‌ కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్ర‌ద‌క్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

– మార్చి 23న ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 23న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శ‌న‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న ట‌కెట్ల‌ను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతారు.

– మార్చి 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తారు.

– మార్చి 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.