జూన్ 12న ఎస్వీ పూర్హోం నందు శ్రీనివాస కల్యాణం
జూన్ 12న ఎస్వీ పూర్హోం నందు శ్రీనివాస కల్యాణం
తిరుపతి, జూన్-2, 2008: తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీవేంకటేశ్వర పూర్హోం నందు జూన్ 12వ తేదిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
జూన్12వ తేది కరంబాడి రోడ్డునందు గల యస్.వి.పూర్హోంనందు సాయంత్రం 6 గం||ల నుండి 8 గం||ల వరకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కనుక పరిసరాల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలెనని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.